|
కేంద్ర విద్యాశాఖ మంత్రి ,ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణా విష్యం మీద మరో సంచలన ప్రకటన చేసారు..చైనా
పర్యటనలో భాగం గా ఓ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా ఆజాద్ మాట్లాడుతూ తెలంగాణా ఏర్పాటుకై అసెంబ్లీ తీర్మానం అవసరమని
అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం లేనిదే ఒక్క ఇంచు కుడా ముందుకు పోలేమని ,తెలంగాణా ఏర్పాటు అసాధ్యమని ఆజాద్ కుండ బద్దలు కొట్టేసారు.రాష్ట్రంలో ఏకాభిప్రాయం రాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని అన్నారు.తెలంగాణా ఏర్పాటు చేయాలని తెలంగాణా లో ఎంత అనుకూలతుందో..సీమాంధ్ర లో అంత వ్యతిరేకతుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రం సమైఖ్యంగానే ఉంచాలని ఆంధ్రప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని అందరి అభిప్రాయాలని పరిగణలోకి తీస్కోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు.శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి స్పష్టమైన సూచనలు చేయకపోడం తో మళ్ళీ సూన్యం నుంచే మొదలు పెట్టాలి అని ఆజాద్ పేర్కొన్నారు.
ఇదే విష్యం మీద కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ ఆజాద్ మాటలు చేష్టలు మోసము కుట్ర గా అభివర్ణించారు .ఆంద్రప్రదేశ్ ఏర్పాటుకి మదరాసీల అనుకూలంగా లేకపోయినా రాష్ట్రం ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.ఆంద్ర ప్రాంత ప్రతినిధులు తెలంగాణా లో ఎలా తిరుగుతారో చూస్తామని ఆయన హెచ్చరించారు.

0 comments:
Post a Comment