|
ఎమ్మార్ ప్రాపర్టీస్ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు ,కడప ఎంపీ వై.ఎస్.జగన్ ఆస్తుల మీద సిబీఐ విచారణ జరిపించాలని ఎన్నికల సమయంలో తెదేపా నేత ఎర్రన్నాయుడు,కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి శంకర్ రావులు కోర్టులో వేసిన పిటిషన్ లో భాగంగా కోర్టు సిబీఐ విచారణ కి ఆదేశించింది ఐతే ఇది కేవలం ప్రాధమిక విచారణ మాత్రమే అని దీన్ని విచారణ లానే పరిగణించాలని (ప్రిలిమినరీ ఇన్వెష్టిగేషన్ ) కోర్టు స్పష్టం చేసింది ఐతే జగన్ తరఫును న్యాయవాది విచారణలో భాగం గా దీన్ని వ్యతిరేకించారు..సిబీఐ విచారణ జరిగితే తమ క్లైంట్ కంపెనీ షేరు వాల్యు పడిపోతుందని పేర్కొన్నా కుడా తాము ఇలాంటి వాదనలు వినధలచుకోలేదని రెండు వారాల్లో సిబీఐ విచారణ ముగించి కోర్టుకి అందించాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
ఐతే ఈ విషయం పై స్పందించిన పీసీసీ చీఫ్ బొత్స.. జగన్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి కి ఇదో గొప్ప అవకాశమని అని బాబు లాగ జగన్ కుడా స్టే తెచ్చుకోకుండా విచారణకి సిద్ధమవ్వాలని ఆయన ఎద్దేవా చేసారు .నేరం రుజువైతే జైలు కెళ్లడానికి కుడా జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండాలని అన్నారు.

0 comments:
Post a Comment