|
సత్య సాయి ట్రస్ట్ లోని పరిస్థితుల్ని గమనిస్తే హాలీవుడ్ సినిమా స్థాయిని తలపిస్తున్నాయి రోజు రోజుకీ ట్రస్ట్ లో వింత వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి,. నిన్న గాక మొన్న బాబా మనవరాలు చేతన ట్రస్ట్ మీద తీవ్ర ఆరోపణలు చెయ్యగా ,ఇవాళ ట్రస్ట్ సభ్యలకి పోలీసు వారి నోటీసులు అందాయి,ఇక విచారణ ఒకటే తరువాయి .ఇదిలా ఉండగా తాజాగా బాబా విదేశీ భక్తుడొకరు కొత్తగా తెరపైకి వచ్చారు తనతో సత్యసాయి అత్యంత సన్నిహితంగా మెలిగేవారని, అన్ని విషయాలు తనతో చర్చించేవారని, ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారని ఐసాక్ టిగ్రెట్ అనే విదేశీయుడు జాతీయ మీడియా లో సంచలనప్రకటన చేసారు.బాబా చాలా సార్లు తనతో మనసు విప్పి మాట్లాడారని, ఆ విషయాలు ఎవరికీ చెప్పవద్దని చెప్పారని అన్నారు. అసలు ట్రస్ట్ ఎలా ఉండాలి, ఎలా నడపాలి,మరీ ముఖ్యమైన వీలునామా విషయాల గురించి కుడా తన వద్ద ప్రస్తావించేవారని అన్నిటికీ తన వద్ద సాక్షాలు కుడా ఉన్నాయని ,కావాల్సివస్తే తన వద్దకు వచ్చిన వారికి తగిన సాక్షాధారాలు చూపిస్తానని టిగ్రెట్ ఇంటర్వ్యూలో భాగంగా అన్నారు.ఈ ఇంటర్వ్యూ దేశంలో సంచలనం రేపుతోంది.అసలు ఈ టిగ్రెట్ ఎవరు ఆయన మాటల్లో వాస్తవం ఎంత అనేది తేలాల్సి ఉంది .. ఐతే ఇది మాత్రం ట్రస్ట్ నెత్తిన పిడుగే అసలే నగదు అక్రమ రవాణా చేస్తూ పీకల్లోతు కష్టాల్లో ఇరుకున్న ట్రస్ట్ కు ,ఈ విషయం మీద ట్రస్ట్ సభ్యులని ప్రశ్నించగా ఆయకీ ట్రస్ట్ కీ ఎలాంటి సంభంధం లేదని ,టిగ్రెట్ మాటలు అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కుడా లేదని సభ్యుల వాదన . ప్రభుత్వం ఏం చేస్తుందో,పోలీసులు ఎం చేస్తారో వేచి చూడాలి .

0 comments:
Post a Comment