|
పేరుకి జే ఏ సీ ..కానీ ఎవరిదారి వారిదే కొందరు రాజీనామా చేస్తారు కొందరు ఎందుకు చెయ్యాలి అని అడుగుతారు ఇంకొందరు అసలు రాజీనామా చెయ్యాల్సిన పనే లేదు అంటారు తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్న సమయం లో అందరినీ ఒక్కతాటి పైకి తేవాలని దీని ఉద్దేశం తో ఏర్పడ్డ ఐకాస కి మొదట్లో అన్ని పార్టీలు వత్తాసు పలకగా ఇప్పుడు పార్టీలో కొందరు సమర్దిస్తే కొందరు విమర్శించే చందాన ఉంది ఉద్యమ పంధా .రాజేనామ చెయ్యండి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్ధాము అని తెరాసా ఐకాస అంటుంటే ,ఉప ఎన్నికల కోసం రాజీనామాలు దండగని తెదేపా తెలంగాణా నేతలంటున్నారు.ఆచి తూచి అడుగులేస్తుంది భాజపా..కాని ముఖ్యం గా ఐకాసా కాంగ్రెస్ పార్టీ లో చిచ్చు పెట్టిందనే చెప్పాలి .. కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కలహాలు కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి ..తమ ఆధిపత్య దోరణితో ఇప్పుడు వారు కేంద్రంలో తమ సొంత కాంగ్రెస్ సర్కార్ మనుగడని ప్రశ్నార్ధకం చేస్తుంది
రాజీనామా చేసి చేతులు దులుపుకుంటే తెలంగాణ వస్తుందా? పదవులు పోతే ఏమీ సాధించలేమని ఎంపి సర్వే సత్యనారాయణ అంటుండగా ..తమ రాజీనామాలను వెనక్కి తీసుకోనే ప్రసక్తేలేదని కె.కేశవరావు బృందం స్పష్టం స్పష్టం చేసింది. రాష్ట్రపతి ప్రసంగంలో కూడా తెలంగాణ ప్రస్తావన ఉందని, కేంద్రం ఆమోదిస్తేనే కదా రాష్ట్రపతి ప్రసంగంలో చోటు లభించేదని కెకె అన్నారు. అంతటితో ఆగకుండా ఓ మెట్టు పైకెక్కి కేంద్రాన్నే తప్పు పట్టేశారు.. చిదంబరం మళ్లీ పాత పాటే పాడారని నేరుగా కేంద్ర హోం శాఖా మంత్రినే విమర్శించారు ఆయన. కాగ ఎంపీల ఫోరం కన్వీనర్ గా రాజీనామా చేసిన ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియని కొనసాగించండి, లేదా రాజీనామాలు ఆమోదించండని కేంద్రాన్ని కోరారు. ఇంకో ఎంపీ ఎంపి మందా జగన్నాథం తమ చర్యల్లో పార్టీ వ్యతిరేకత ఎక్కడ ఉందని ప్రశ్నించారు
కాగా చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకం కాదని ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ తెలిపారు. 9 మంది ఎంపిల రాజీనామాలను ఇంకా ఆమోదించలేదని ఆయన అన్నారు.లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ రాజీనామా చేసిన ఎంపీలతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వేచి ఉండమని ఆమె వారిని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపిల రాజీనామాలు,బందుకి పిలుపునివ్వడం తో తెలంగాణ లో పరిస్థితుల గురించి వారు చర్చిస్తారు అని తెలుస్తోంది

0 comments:
Post a Comment