|
ఆంధ్ర, తెలంగాణ విడిపోక తప్పదని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్నారు. ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ రాజీనామాలు చేశారని అన్నారు. వందమంది రాజీనామాలని పరిగణలోకి తీసుకుని పార్లమెంట్ లో తక్షణమే ప్రత్యేక తెలంగాణా బిల్లు పెట్టాలని ఆయన అన్నారు .. రాజీనామాలకు కేంద్రం స్పందించక పోవడం బాధాకరం అని,రాష్ట్రం విడిపోవడానికి సీమాంధ్ర నేతలు సహకరించాలని ఆయన కోరారు. అలా సహకరించకపోతే జరిగే పరిణామాలకు సీమాంధ్ర నేతలే బాధ్యత వహించాలని కెసిఆర్ హెచ్చరించారు.కాగా ఆర్టీసి చైర్మన్ పదవికి ఎం. సత్యనారాయణ రాజీనామా చేసారు ,తన రాజీనామా లేఖని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపినట్లు సమాచారం

0 comments:
Post a Comment