|
పాదయాత్ర.....ఈ పేరు వింటే ఠక్కున గుర్తుకొచ్చే వ్యక్తి దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆ పాదయాత్ర జరిగి నేటికి సరిగ్గా ఎనిమిదేళ్ళు. ఆ పాద యాత్రే కాంగ్రెస్ కి ఊపిరి అందించింది . రాష్ట్ర రాజకీయాల ను మలుపు తిప్పింది .కరవు, కాటకాలతో విలవిల్లాడుతున్న ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకునేందుకు 2003, ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాదయాత్రకు వైఎస్ శ్రీకారం చుట్టారు. మండు వేసవిలో నిప్పులు చెరిగే ఎండను సైతం లెక్క చేయకుండా ‘ప్రజా ప్రస్థానం’ పేరిట కాలినడకన బయలుదేరిన వైఎస్ కాళ్లు బొబ్బలెక్కినా, ఆరోగ్యం క్షీణించినా వెనుదిరగలేదు. ఆ పాద యాత్ర కు అధ్బుత మైన స్పందన లభించింది .వైఎస్ జీవితాన్ని కూడా కొత్త మలుపు తిప్పింది .సుమారు 58 రోజులపాటు వైఎస్ 1,450 కిలోమీటర్లు నడిచారు. ఎనిమిదేళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు (జూన్ 14)న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో యాత్రను ముగించారు. చరిత్రలో ఇదొక రికార్డు .ఆ రికార్డు ను ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయ లేదు . ఐతే ఈ సందర్బాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ మాత్రం ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకపోవటం గమనార్హం.

0 comments:
Post a Comment