|
దివంగత ముఖ్యమంత్రి వై యస్ .రాజశేఖర రెడ్డి ప్రజలకు చేరువ కావడానికి యాత్రలనే ఆయుధం లా ఎంచుకున్నారు.ప్రతి పక్ష నేతగా చేసిన పాదయాత్ర అయినా ముఖ్యమంత్రి
గా చేసిన పల్లె బాట,నగర బాట ,రచ్చబండ ఇలా ఏదైనా సరే ప్రజా మధ్య ఉండి వారి కష్ట- సుఖాలు తెలుసుకోవడానికే ఆయన ప్రాధాన్యతనిచ్చేవారు. అవే ఆయన్ని ప్రజలకు దగ్గర చేసి ప్రజల మనిషిని చేశాయి.
రాష్ట్రం లో కాంగ్రెస్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో "ప్రజా ప్రస్థానం" పేరుతో 2003 జూన్ 14 న రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి ఆయన చేపట్టిన సుధీర్గ పాదయాత్ర తొమ్మిదేళ్ళ తరువాత రాష్ట్రం లో కాంగ్రెస్ కి అధికారాన్ని హస్తగతం .
ఊరూరా విస్తృతంగా పర్యటిస్తూ తెదేపా పాలనని ఎండకట్టారు. 68రొజుల పాటు 11జిల్లాల పరిధిలోని 1470 కిలో మీటర్లు అవిశ్రాంతంగా కాలినడకన సాగిన ఈ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లాభించింది.
ప్రజా ప్రస్థానం సాగిందిలా...
తొలి వారం : 2003 ఏప్రిల్ 9 నుంచి 15 వరకు రంగారద్ది ,మెదక్ జిల్లాల పరిధిలో 159 కిలోమీటర్లు
రెండో వారం : ఏప్రిల్ 16 నుండి 22 వరకు మెదక్ నిజామాబాద్ జిల్లాల పరధిలో 160 కి.మీ
ఐదో వారం : మే 7 నుండి 13 వరకు ఖమ్మం ,పశ్చిమ గోదావరి జిల్లాల్లో 166కి.మీ
ఆరో వారం : మే 14 నుండి 20వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 103కి.మీ
ఎనిమిదో వారం : మే 28 నుండి జూన్ 3 వరకు విశాఖ లో 156 కి.మీ
తొమ్మిదో వారం:జూన్ 4 నుండి 10 వరకు విజయనగరం,శ్రీకాకుళం పరిధిలో 166 కి.మీ
పదో వారం : జూన్ 11 నుండి 15 వరకు శ్రీకాకుళం జిల్లాలో 144 కి.మీ
68రొజుల పాటు మండుటెండని సైతం లెక్క చెయ్యకుండా 11జిల్లాల పరిధిలోని 1470 కిలో మీటర్లు 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాగిన పాదయాత్ర జూన్ 14న ఇచ్చాపురం "రణ స్థలి "వద్ద విజయవంతంగాముగించారు.
పాదయాత్ర ఎంత గొప్ప విజయం సాధించిందంటే 2009 ఎన్నికల్లో ఇటు ప్రతిపక్షాలు తెదేపా ,తెరాస ,వామపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన మహా కూటమిని,అటు చిరంజీవి ప్రజారాజ్యం ని కాదని మళ్ళీ వై.యస్ నే ముఖ్యమంత్రిని చేసుకుందాము అని ప్రజలు అనుకుని అధికారం తిరిగి మహా నేతకే కట్టపెట్టారు...అంతగా వారందరి మనస్సులో ఈ పాదయాత్ర తో సుస్థిర స్థానం సంపాదించుకున్న రాజ శేఖరుడు లేని లోటు ఈనాడు రాష్ట్రం లో సుస్పష్టంగా కనపడుతోంది.

0 comments:
Post a Comment