14 June 2011

హర్షకుమార్ పెద్ద ఫ్రాడ్ .... ఆ లేఖ బయట పడటం దురదృష్టకరం

హర్షకుమార్ పెద్ద ఫ్రాడ్ అని అవినీతి పరుడని మతి భ్రమించి  ఆయన మాట్లాడుతున్నారని మంత్రి విశ్వరూప్ ,ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లు అన్నారు.అటువంటి హర్ష కుమార్ బొత్సా గురించి వ్యాఖ్యానించటం తప్పని వారు అన్నారు.
 
ఇదిలా  ఉండగా  పీసీసీ చీఫ్ కి వ్యతిరేకంగా సోనియా గాంధీ కి తాను రాసిన లేఖ  బయట పడటం దురదృష్టకరమని..ఎలా బయటపడిందో తెలీదని  అమలాపురం కాంగ్రెస్ ఎంపీ
హర్షకుమార్ అన్నారు.తాను రాసిన లేక లోని  విషయాలు వాస్తవమే అని బొత్సా దళితుల్ని ఎప్పుడూ దూరంగానే ఉంచేవాడని..తాను విజయనగరం శ్రీకాకుళం లో పర్యటించినప్పుడు  అంటరాని తనాన్ని కళ్ళారా చూశానని .. తాను అధినేత్రికి రాసిన లేఖ లో ఈ విషయాల్ని స్పష్టంగా తెలిపానని అన్నారు.తన మీద క్రమశిక్షణా    చర్యలు  ఉండబోవు అని తాను అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
  

Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us