16 June 2011

ఎమ్మెల్యే పదవికి చిరు రాజీనామా


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి ప్రభుత్వం లో మంత్రి పదవి దక్కకపోవడంతో కిరణ్ కి వ్యతిరేఖంగా పనిచేస్తానని బాహాటంగానే ప్రకటించిన చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా  రెడ్డి గత కొంతకాలంగా కిరణ్ ని  విమర్శిస్తూనే ఉన్నారు..తను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లానే కావటం మూలాన ఈ విషయంలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరంజీవి  రాయబారం నడిపారు .బుధవారం తిరుపతి పర్యటన లో ఉన్న చిరు..పర్యటన్ అల భాగం గా పెద్ది రెడ్డి ని కలిసి బుజ్జ గిచ్చిన్నట్లు తెలిసింది..దాదాపు అరగంట వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు .ఈ సందర్భంగా తనకి కిరణ్ సర్కార్ లో మంత్రి పదవి దక్కకపోవడం నిరాశ కలిగించిందని  అనగా..చిరు పెద్దిరెడ్డి తో..అన్ని విషయాలు అధినేత్రి సోనియా  కి తెలుసు  ,పార్టీని వీడద్దు  మీ అవసరం ఇప్పుడు కాంగ్రెస్ కి ఎంతైనా ఉంది ,తిరుపతికి ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది మనం అందరం కలిసి పని చెయ్యాల్సిన సమయం ఆసన్నమైందని  ఆయన అన్నారు .త్వరలోనే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయ్యనున్నట్లు,ఆ తరువాత ఉప ఎన్నిక విషయం కుడా వీరిద్దరి  చర్చల్లో భాగం గా ప్రస్తావనకి వచ్చాయి.   

Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us