|
|
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు అధిష్టానంతో అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ మండళ్ల ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. లగడపాటి రాజగోపాల్ లాంటి చీడపురుగులు ప్రత్యేక తెలంగాణకు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. శ్రీకృష్ణ కమిటీని తన ధన బలంతో లగడపాటి ప్రభావితం చేశారన్నారు. డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడకుంటే పార్టీ వదిలిపోవాలని లగడపాటికి పొన్నం సూచించారు. | |
| | |
| | |
0 comments:
Post a Comment