|
ఏ రైతు మొహానా చిరునవ్వు లేదు. మద్దతు ధర ఇచ్చే ప్రభుత్వం లేదు. రైతులు, పేదల సమస్యలపై పోరాడాల్సిన చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు.ప్రతి రైతూ, ప్రతి పేదా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని ఎదురు చూస్తుంటే చంద్రబాబు.. కనీసం ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అనే ఆలోచన కూడా చేయడం లేదు. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ‘మొన్న జరిగిన ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే. ఆరు నెలలు కావచ్చు.. ఒక సంవత్సరం కావచ్చు... రెండేళ్లు కావచ్చు... త్వరలో ఫైనల్స్ జరుగుతాయి. ఆ ఫైనల్స్‌లో ఈ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు’ఈసారి వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుంది. ప్రతి రైతు సోదరుడి మొహాన చిరునవ్వును చూసే ఆ రోజు దగ్గరలోనే ఉంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

0 comments:
Post a Comment