|
చిరంజీవి మమ్మల్ని రాజీనామా చెయ్యడం హాస్యాస్పదం అని ..మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తిట్టి.. ఈ రోజు పదవుల కోసం సిగ్గులేకుండా అదే పార్టీ పంచన చేరాడు. పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడు.మంత్రి పదివి కోసం చిరు కాంగ్రెస్ లోకి వొచ్చారని అది ఆయన గుర్తుపెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు .
నాకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నైతికత ఉంటే రాజీనామా చేయాలని సినీ నటుడు చిరంజీవి అంటున్నారు. వైఎస్ వల్ల అధికారంలోకి వచ్చామన్న కృతజ్ఞతతో వారు నాకు నైతిక మద్దతు ఇస్తున్నారు. అధికార పార్టీవైపు ఉంటే వారికి చాలా లబ్ధి కలుగుతుంది.. వారు ఆ లబ్ధిని కూడా వదులుకుని.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ప్రేమతో.. ఆయన కుటుంబాన్ని ఒంటరిగా చూడలేక.. నైతిక విలువలకు నిలబడి నాకు అండగా ఉన్నారు. ఆ సినీనటుడికి నైతికత ఉందా? లేక అన్నీ కష్టాలు నష్టాలేనని తెలిసినా వైఎస్ కుటుంబానికి అండగా నిలబడిన ఈ ఎమ్మెల్యేలకు నైతికత ఉందా?’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
కాగా తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు చిరు మాటలు హాస్యాస్పదం అని సామాజిక న్యాయం పేరుతో వచ్చిన చిరంజీవి రాష్ట్రానికి ఏదో ఒరగబెడతారని నమ్మి 70 లక్షల మంది ఓటు వేసి, 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆయన పీఆర్పీని నిమజ్జనం చేశారని ధ్వజమెత్తారు.

0 comments:
Post a Comment