18 June 2011

ఎంపీల కన్వీర్ గా రాజీనామా చెయ్యడంతో ఎంతో ప్రశాంతంగా ఉంది :పొన్నం

ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరమ్ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సవాల్‌ను ఆయన స్వీకరించారు. ఎంపీల ఫోరమ్ విభజనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజనకు అంకురార్పణ జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీ ఎంపీల ఫోరమ్ కన్వీనర్‌గా ఉంటూ తెలంగాణపై వ్యాఖ్యలు చేయడం సరికాదని, అదే కొనసాగిస్తే ఎందుకు రాజీనామా చేయకూడదని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నించడం తెలిసిందే. దీనిపై శరవేగంగా స్పందించిన పొన్నం ప్రభాకర్, తాను కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బండారం బయట పెడతానని పొన్నం హెచ్చరించారు. అవసరమైతే విజయవాడ వచ్చి లగడపాటి వ్యాపార కార్యకలాపాల గుట్టు రట్టు చేస్తానన్నారు. ఎంపీల కన్వీర్  గా రాజీనామా చెయ్యడంతో  తనకు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు.లగడపాటికి తెలంగాణ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణకు ప్రత్యేక పీసీసీ పదవి అవసరమని, సీఎం సహా అన్ని పదవులకూ ఇదే సూత్రం వర్తింపజేయాలనీ డిమాండ్ చేశారు.

Congress, Telangana issue

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us