|
తెలంగాణ పార్లమెంటు సభ్యులు చేసిన వ్యాఖ్యలపై విజయవాడ .ఏ.పీ ఎంపీలకు పొన్నం కన్వీనర్‌గా ఉండి తెలంగాణ వాదానికి అనుకూలంగా సీమాంధ్ర ఎంపీలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి హైదరాబాద్ నుంచే 40 శాతం ఆదాయం వస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సమైక్యవాద పార్టీలకు 240 సీట్లు ఖాయమని, వేర్పాటు వాద పార్టీలకు 40 సీట్లకు మించి రావని లగడపాటి అన్నారు. తనవల్లే ప్రత్యేక రాష్ట్రం ఆగిదనడం సరికాదని ఆయన అన్నారు.హైదరాబాదులోని 80 శాతం ప్రజలు సమైక్య రాష్ట్రానికే మద్దతు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు.తెలంగాణా వస్తే ఇంటింటికి ఉద్యోగం వస్తుందని చెప్పి అక్కడి ప్రజలని వారు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.వేర్పాటువాదుల చేతుల్లోకి రాష్ట్రం వెళితే హైదరాబాద్ అల్లకల్లోలం అవ్తుందని మతతత్వ శక్తులు అల్లకల్లోలం సృష్టిస్తాయని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పిందనీ,తెలంగాణాకోసం రాజీనామాలు చేసినవారు మళ్లీ ఎన్నికల్లో పోటీ ఎందుకు చేశారూ..? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టబోమని చెప్పినవారు మళ్లీ అక్కడికే ఎందుకు వచ్చారు..? తెలంగాణా కోసం ఏం చెయ్యడానికైనా సిద్దంగా ఉన్నామని చెప్తున్న వారు కనీసం ఎంపీల కన్వీనర్ గా కుడా రాజీనామా చెయ్యకుండా ఆ పదివిని పట్టుకుని ఎలాడుతున్నారని అటువంటి వాళ్లకి నన్ను విమర్శించే హక్కు లేదని ఆయన తన రీతిలో ఘాటుగా స్పందించారు

0 comments:
Post a Comment