19 June 2011

బాబా మరణానికి అసలు కారణం సత్యజిత్తేనా ??? ఆదికేశవులు నాయుడు ఆరోపణల్లో నిజమెంత

పుట్టపర్తి సత్య సాయి బాబా మరణానికి కారణం బాబా వ్యక్తిగత  సహాయకుడు  సత్యజిత్ ఏ అని తీతీదే పాలకమండలి మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.సత్యజిత గత ఐదేళ్లుగా బాబా తినే ఆహరం లో నిద్ర మాతర్లు కలుపుతూ ఆయన శరీరంలో ఏ ఒక్క అంగము పని చెయ్యకుండా ఆయన్ని వీల్ ఛైర్ కే అంకితం అయ్యేలా చేశారని ఆయన ఆరోపించారు.సత్య సాయి ఉండే యజుర్వాడే మందిరంలోని ప్రతి పైసా కి సత్యజిత్ కి లెక్క తెలుసునని ,పోలీసులు సత్యజిత్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజాలు బయటపడతాయని ఆయన అన్నారు.

ఆదికేశవులు నాయుడు చేసిన ఆరోపణల్లో ఎంత వరకు వాస్తవమని ఆలోచిస్తే సాయి మందిరంలో భారీగా నగదు, నగలు ఉంటాయని  ఆశించారు కానీ  ట్రస్ట్ ప్రతినిధులు కేవలం 11 .56   కోట్ల రూపాయలు  మాత్రమే నగదు రూపంలో మిగతాది బంగారం వెండి డాక్యుమెంట్స్ రూపం లో భద్రం గానే ఉందని పేర్కొనడం ,  నిన్న రాత్రి సత్య సాయి ట్రస్ట్ వాహనం లో తరలిస్తున్న 35 ,53 ,500  రూపాయలు  చెక్ పోస్ట్ వద్ద పట్టు పడటం పలు అనుమానాలు రేపుతోంది. బాబా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయం లోనే  భారీ మొత్తం లో నగదుని బెంగళూరు తరలించారని పలు రకాల వార్తలు  వినపడుతున్న నేపధ్యం లో ఆదికేశవులు నాయుడు ఆరపణలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి .మరి పోలీసులు ,ప్రభుత్వాధికారులు ఏం చేస్తారో అనేది వేచి చూడాలి .నిన్న డబ్బు తరలిస్తూ పట్టు పడ్డ ద్రివేర్లని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపధ్యం లో ట్రస్ట్ సభ్యులు మీడియా ముందుకొచ్చి అనుమానాలను నివృత్తి చెయ్యాల్సిన అవసరం  ఉంది .

General Issues

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us