|
ఈనెల 11న సథరన్ టూర్స్ & ట్రావల్స్ సంస్థ సౌజన్యం తో మానస సరోవర్,మౌంట్ కైలాష్ ఇతర ఉత్తర భారత యాత్రా ప్యాకేజ్ టూర్ లో భాగంగా మూడు రాజుల క్రితం మౌంట్ కైలాష్ యాత్రకెళ్ళిన మంత్రి కన్నా లక్ష్మి నారాయణ ,ఆయన ఇద్దరు కుమారులు ,భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఇవాళ ఉదయ 6 నుంచి చైనా భూభాగం లోని హిల్సా ప్రాంతం లో చిక్కుకుపోయారు.ఉష్ణోగ్రత -మూడు డిగ్రీల సెంటి గ్రేడ్ ఉన్నట్లు సమాచారం.సమాచారం తెలియగానే మంత్రి వట్టి వసంతకుమార్ ట్రావెల్ యాజమాన్యాన్ని సంప్రదించగా మాకేం సంబంధం లేదని,వారు యాత్ర కాన్సిల్ చేసుకున్నట్లు యాజమాన్యం చెప్తోంది.ఐతే కన్నా ని సంప్రదించగా మేము ఉఅద్యం పోయి సాయంత్రానికి తిరిగి వొచ్చేస్తామని అనుకుని శాలువా కుడా తీసుకెళ్ల లేదు అని ,ట్రావెల్ యాజమాన్యం వారేమో తమని రోడ్ మీదనే వదిలేసారని ,తాము ఒక రాయి మీదనే ఉదయం నుండి కుర్చున్నామని తెలిపారు,కేంద్ర టూరిసం శాఖ సహాయ మంత్రి ని సంప్రదించానని ,వారు హెలికాప్టర్ పంపుతామన్నారని ఆయన తెలిపారు.ఐతే ఆయన సంప్రదించిన మాట నిజం కాదని అంత వదంతే అని రాష్ట్రం తరఫున కేంద్రం తో మాట్లాడాల్సి ఉందని ,హెలికాప్టర్ పంపాల్సి ఉందని తెలుస్తోంది.సాయంత్రం ఐదు కల్లా చేకటి పడే ఈ ప్రాంతం లో సహాయక చర్యలు త్వరతగతిన చేపట్టాల్సి ఉంది.

0 comments:
Post a Comment