21 June 2011

సర్వే..Don't Behave Like an Idiot... :మంత్రి శంకర్రావు. తీవ్ర వాగ్వాదం

అది పేరుకు ప్రోటోకాల్ వివాదమే అయినా  అది వారిలోని అసూయ ఈర్షలని బట్టబయలు  చేసింది. వారివారి కాదు మన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ,ఇరువురూ  తమ లోని కసిని ద్వేషాన్నీ బాహాటంగా  చూపించుకున్నారు.
నువ్వు వెదవ... అంటే నవ్వే వెదవ  ..  అని  తీవ్ర పదజాలంతో తిట్టుకున్నారు .అందులో ఒకరు  మంత్రి  మరొకరు ఎం.పీ కావడం విశేషం.బొల్లారం ప్రభుత్వ పాఠశాల ఇందుకు వేదికైంది. విషయంలోకి వెళ్తే ..
ఎంపీ సర్వే సత్యనారాయణ, మంత్రి శంకర్రావు మధ్య మంగళవారం ఓ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. బొల్లారం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవటంపై సర్వే మండిపడ్డారు

అది కాస్తా ముదిరి నువ్వెంత అంటే నువ్వెంతా అంటూ ప్రజాప్రతినిధులు పరస్పర దూషణకు దిగారు.. మంత్రి శంకర్రావు ని  ఇదేమిటని సర్వే ప్రశ్నించగా నీ పరిదేందో నువ్వు తెలుసుకో  అంతవరకే  ఉండు అని మంత్రి బదులిచ్చారు..ఒక బాధ్యత గలిగిన  రాజకీయ నాయకుడిగా అడుగుతున్న అనగా మళ్ళీ అదే రకంగా  సమాధానం రావటం తో ..సర్వే ," డోంట్ బిహేవ్ లైక్ యాన్ ఇడియట్ "(Don't Behave Like an Idiot) అని అనడం తో రెచ్చిపోయిన శంకర్ రావు ఆగ్రహం తో నువ్వు పరమ  ఇడియట్ వి అని దుర్భాషలాడారు.సర్వే కుడా నేను తగ్గేది లేని అని  అందుకున్నారు మీడియా గమనిస్తుందని కుడా పట్టించుకోకుండా వేరిద్దరూ వీధి రౌడీల్లా తిట్ల పురాణం మొదలు పెట్టడం తో అక్కడున్న వారు ఆశ్చర్య పోవటం తప్ప ఏమి చెయ్యలేకపోయారు .దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి  చేరటం తో  కార్యక్రమం  కుడా అవ్వకుండానే మంత్రి నిష్క్రమించటం కొసమెరుపు  .   

Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us