|
ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ చైర్మన్ సురేష్ టెండూల్కర్(72) గుండెపోటుతో ఈ ఉదయం పుణేలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
సురేష్ టెండూల్కర్ మరణం పట్ల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాపం ప్రకటించారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని పేర్కొన్నారు. పేదరికం నిర్మూలన కోసం కృషిచేసిన ఆయన భావితరాలకు మార్గదర్శకంగా నిలిచారని టెండూల్కర్ భార్య సునెత్రా టెండూల్కర్‌కు పంపిన సంతాప సందేశంలో ప్రధాని పేర్కొన్నారు. సురేష్ టెండూల్కర్ తనకు మంచి మిత్రుడని, ఆయన మరణంగా వ్యక్తిగతంగా తనకు తీరని లోటని మన్మోహన్ అన్నారు.
coutesy: www.sakshi.com

0 comments:
Post a Comment