21 June 2011

సత్య సాయి ట్రస్ట్ పేరుతో మీడియా లొల్లి ..అసలు ఏం జరుగుతోంది ??? ఏంటి వాళ్ళ గొడవ ..

సత్య సాయి ట్రస్ట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపధ్యం లో రాష్ట్ర మీడియా కుడా తన హడావుడి మొదలు పెట్టింది.గుడ్డెద్దు చేను లో పడిందన్న చందాన ఉంది మన మీడియా పరిస్థితి.సాయి ట్రస్ట్ లో జరుగుతుంది అవినీతని..పరిస్థితీ అదుపులో లేదని ..పోలీసులకి నిజాలు చేధించే అంత దమ్ము లేదని ట్రస్ట్ లో ఉన్నవారంతా కేటుగాళ్ళే అని..గతం లో హత్యలు జరిగాయని..పోలీసులు ట్రస్ట్ కి ట్రస్ట్ సభ్యులకి కొమ్ము కాస్తున్నారని ,సాయి పాదుకలు(పావుకోళ్ళు) మీద దేవతల అచ్చులున్నాయని భక్తుల విశ్వాసాలు దెబ్బతింటున్నాయని ,ఒకటేమిటి ఇలా రకరకాల కధనాలు మన తెలుగు మీడియా లో వస్తున్నాయి .
అసలు ఈ హత్యల ఉదంతమే తీసుకుంటే అది ఎప్పుడో 1993 -98 మధ్యలో వెలికి చూసిన వార్త.సత్య సాయి మందిరంలోనే  శెవాలు దొరికాయని అప్పట్లోనే చాలా కధనాలు వినపడ్డాయి ,చెరువుల్లో విదేశీయుల మృతదేహాలు కుడా బయటపడ్డ సంఘటనలు  కుడా ఉన్నాయి ,అవి ఎవరు చేసారు ఏంటి అనేది అక్కడ ప్రజలకి కుడా తెలుసు ఐనా ఎవరూ నోరు మెదపరు  ఏ ఒక్క పోలీసు కుడా ప్రశాంతి నిలయం లోకి ప్రవేశించడానికి కుడా ప్రయత్నించలేదు..మరి ఈరోజున డీజీపీ అరవిందరావు నేతృత్వంలోని పోలీసులు  ట్రస్ట్ సభ్యులకి నోటీసులు కుడా ఇచ్చి విచారణ  చేపడుతున్నారు ఇలాంటి సమయం లో అసలు మీడియా లోల్లేంటి ? నిజాలు చెప్పదలచుకున్నాయా...లేక ట్రస్ట్ పేరుతో పబ్బం గడుపుకుంటున్నాయా??? 
నిజాలు బయటపెట్టడమే ఉద్దేసమైతే మరి గతంలోనే ఈ విషయాల మీద ఎందుకు ఈ చానెళ్ళు పోరాడలేదు???
ఈ రోజున ఎందుకు పందేలు విసురుతున్నాయి???
పోనీ ఇరవయ్యో శతాబ్దం లో ఛానళ్ళు లేవు..అనుకుంటే ఆనాడు పత్రికలు ఏం వెలగపెట్టాయి???
ఈ రోజు సత్య సాయి బాబా నే  కాదు హంతకుడు ..ట్రస్ట్ లో ఉంది తోడు దొంగలే అని అంటున్న వీళ్ళు మరి గత ఐదు పదేళ్లుగా నిద్రపోతున్నారా???
సత్య సాయి బ్రతికి ఉన్నప్పుడు ఎందుకు ప్రస్నించలేదు??? ఈరోజున పని గట్టుకుని మరీ ప్రత్యేక ప్రోగ్రాములు  ,చర్చా వేదికలు నిర్వహించి మరీ ట్రస్ట్ ని ట్రస్ట్ సభ్యులనీ ,ప్రభుత్వ చిత్తసుద్ధిని  ప్రశ్నిస్తునాయి  ..ఇవన్నీ కేవలం టీఆర్పీ రేటింగులు  పెంచుకునేందుకు చేసే కార్యక్రమాలు  మాత్రామే.. సత్య సాయి మరణించక ముందే సీబీఐ చేత విచారణ  జరిపించి నిజాలేంటో నిగ్గు తెల్చవచ్చును కదా??? మరి ఆనాడు మాట్లాడారా అంటే లేదు...ఆనాడు అడగని వారికి  ఈనాడు మాట్లాడే,ప్రశ్నించే అర్హత కుడా లేదు..టీ.ఆర్ పీ ల  రేటింగులు కోసం కాకుండా  నిజంగా చిత్తశుద్దితో సమాజ సేవ ,బాగోగులే లక్షంగా  మీడియా పని చెయ్యాలని మనవి. 

General Issues

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us