|
ప్రొఫెసర్ జయశంకర్‌కు ప్రముఖులు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,చిరంజీవి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, , టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి రోశయ్య, మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, నారాయణ, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగర్‌రావు, ప్రజా గాయకుడు గద్దర్, మంత్రులు, ఎంపీలు, పలువురు ఘనంగా అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకుల స్పందన కె.సి.ఆర్:జయశంకర్ మృతి తెలంగాణ ఉద్యమం చేసుకున్న దురదృష్టం అన్నారు. వ్యక్తిగతంగా తనకు పెద్దలోటన్నారు. ఇది తెలంగాణ ఉద్యమం చేసుకున్న దురదృష్టం అన్నారు.మృత దేహాన్ని చూసి కె.సి.ఆర్ కంటనీరు పెట్టుకున్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు :ప్రొఫెసర్ జయశంకర్ మృతితో తెలంగాణ ఉద్యమం పెద్దదిక్కును కోల్పోయింది .ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం అని హరీష్ అన్నారు.ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి: తెలంగాణ ఉద్యమం పట్ల జయశంకర్‌కు స్పష్టమైన వైఖరి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే జయశంకర్‌కు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు.కోదండరామ్: ఆయన మృతి తమకి తీరని లోటని ,ఈ మూడు రోజులు ఆయన సంతాప కార్యక్రమాలు తప్ప తెలంగాణ సంఘాలు ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆయన కోరారు.
ప్రజాగాయకుడు గద్దర్ :జయశంకర్ మృతి తెలంగాణకు తీరని లోటు, తెలంగాణకు జరిగిన అన్యాయంపై జయశంకర్ సుదీర్ఘ పోరాటం చేశారన్నారు.
జయప్రకాష్ నారాయణ: ప్రొఫెసర్ జయశంకర్ మృతితో సమాజం గొప్ప విద్యావేత్తను కోల్పోయిందని జే.పీ అన్నారు.
సీపీఎం కార్యదర్శి రాఘవులు: జయశంకర్ జీవితం అందరికీ ఆదర్శమని బీ.వీ రాఘవులు అన్నారు.
జయశంకర్ మృతి పట్ల సీ.ఎల్పీ సంతాపం తెలిపింది.

0 comments:
Post a Comment