|
తెరాసా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ (76) మంగళవారం ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.ఐతే ఆయన కోరిక మేరకు ఆయన నివాసానికి మొన్ననే ఆయన్ని తరలించారు.1969 తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చురుకుగా పాల్గొన్నారు.1979 -1981 మధ్య కాలం లో ఆయన కాకతీయ విశ్వవిద్యాలయ రిజిష్ట్రార్‌గా పనిచేశారు.తెరాసా ఆవిర్భావం లో ,సిద్ధాంతాలలో ఆయన కృషి మరవలేనిది.
ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్రియలు రేపు ఉదయం హన్మకొండలో జరుగుతాయి. ప్రజలు,అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని ఏకశిల పార్క్ లో ఉంచారు,అక్కడి నుంచి రేపు ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఆయన మృతితో తెలంగాణవాదులు శోకసంద్రంలో మునిగిపోయారు.

0 comments:
Post a Comment