|
సత్య సాయి బాబా మరణానికి కారణం సత్యజిత్ అని ఆదికేశవుల నాయుడు ఆరోపించిన నేపధ్యం లో ఇప్పుడు తాజాగా బాబా మనవరాలు చేతన ఇంచుమించు ఇలాంటి ప్రకటనే చేయడం కలకలం రేపుతోంది.బాబా కి చికిత్స అందించే విషయం లో తీవ్ర తాత్సారం జరిగిందని..తాము డాక్టర్ సఫాయా ని కలిసి వివరాలు తెలుసుకుందామని చూడగా తమతో చాల దారుణంగా ప్రవర్తించారని,మాట్లాడటానికి కుడా నిరాకరించారని,తమ వద్ద నిజాలు దాచిపెట్టారు అని .బాబా వాస్తవ పరిస్థితిని ఏంటి అని కనీసం బాబా భక్తుల కి తెలిసిన విషయాలు కుడా తమకి తెలియలేదు అని..ఆమె అన్నారు.ట్రస్ట్ సభ్యులు తమతో అమానుషంగా ప్రవర్తించారని ఆసుపత్రి లో వారు కుడా ఏ ఒక్క విషయాన్నీతమకి వెల్లడించలేదని ఆమె ట్రస్ట్ సభ్యుల మేధా తీవ్ర ఆరోపణలు చేసారు. బాబా మరణం పట్ల తనకి అనుమానాలు ఉన్నాయని,సత్య సాయికి అందించిన చికిత్స యొక్క వివరాలు బయట పెట్టాలని బాబా మనవరాలు అన్నారు.సత్య సాయి ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన శ్రీనివాసన్ బాబా కుటుంబ సభ్యులని యజుర్వేద మందిరం లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.తనకు ప్రాణ హాని ఉందని ఆమె అంటున్నారు.

0 comments:
Post a Comment