03 June 2011

ముందు తెలంగాణా కోసం అవిశ్వాసం పెట్టండి

ముందు తెలంగాణా అంశం మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని ఆ తరువాతనే  స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్  ఎన్నికల సంగతి చూడాలని తెలుగు దేశం బహిష్కృత నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు .అవిశ్వాసం ఓ డ్రామా అని , తెలంగాణా ఉద్యమం ఉధృతమవుతున్న నేపధ్యం లో సమైక్య నాయకుల కుట్ర గా అని ఆయన అభివర్ణించారు.కేంద్రం తెలంగాణా అనుకూల నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామని ఆయాన తెలంగాణా నేతలను కోరారు.తెలంగాణా టిడిపీ లో నలుగురు దుష్టులున్నారని వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు .
తమకు తెలంగాణా తప్ప ఇంక ఏదీ ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేసారు .బాబు అన్నట్లుగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని బాబు అంటున్నాడు  అంటే తెలంగాణా రాదు అనే అర్ధమని దీని తెలంగాణా టీడీపి నేతలు గ్రహించాల్సిన అవసరముందని .కాంగ్రెస్ టీడీపి కలిసి ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆయన అసెంబ్లీ  మీడియా పాయింట్ వద్ద  విలేకరులతో మాట్లాడుతూ అన్నారు . ఒకే ఎజెండా ఒకే జెండా అని అన్నారు.తెలంగాణా దుష్ట నేతలెవరని అడగగా వారికి కొన్ని రోజుల సమయం ఇస్తున్నా అని ఆ తర్వాత వారి సంగతి బట్టబయలు చేస్తానని తెలంగాణా ని ఎవ్వరూ ఆపలేరని అన్నారు.     

General Issues, Telangana issue

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us