05 June 2011

దీక్ష ఆగలేదు ...ఆగబోదు : రామ్‌దేవ్ బాబా

అవినీతికి వ్యతిరేకం గా ప్రారంభించిన తన దీక్ష ఆగ లేదని,ఆగ బోదని  ఇంకా కొనసాగుతూనే ఉందని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు.ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో బాబాను అరెస్టు చేసి హరిద్వార్ తరలించిన తర్వాత ఆదివారం ఆయన ఆశ్రమంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తనను మోసగించిందని, తనకిచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా పారిపోయిందని బాబా  విమర్శించారు. ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేస్తోందని బాబా మండిపడ్డారు. తన దీక్షను భగ్నం చేసేందుకు కేంద్రం పోలీస్ బలగాల ద్వారా పాశవిక చర్యకు దిగిందని ఆరోపించారు.
 శాంతియుతంగా జరుగుతున్న దీక్షా శిబిరం వద్ద పోలీసులు రాక్షసంగా ప్రవర్థించారని, తన అరెస్టును అడ్డుకున్న కార్యకర్తలపై లాఠీ చార్జీ జరిపారని బాబా  తెలిపారు . కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ తనను తప్పుదోవ పట్టించారని, తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. తన దీక్షకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును, ప్రజాదరణను చూసి తట్టుకోలేని ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు.

General Issues, Lokpaal

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us