|
లోక్ పాల్ సంయుక్త కమిటీ నుంచి అన్నాహజారే , ఇతర పౌర సమాజ సభ్యులు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. రాందేవ్ బాబా అరెస్టుకు నిరసగా వారీ చర్యకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.దీనితో లోక్ పాల్ బిల్లు వ్యవహారం గందరగోళంలో పడే అవకాశం ఉంది.కాగా తనపట్ల ఢిల్లీలో పోలీసులు వ్యవహరించిన తీరుపై యోగా గురువు రాందేవ్ బాబా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తనను అరెస్టు చేసి హరిద్వార్ కు తీసుకు వెళ్లడంపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు.తనను అరెస్టు చేసే సమయంలో మహిళలను, పిల్లలను విచక్షణారహితంగా పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని ఆయన ఆరోపించారు. అనేక మంది తన మద్దతుదారులు గల్లంతయ్యారని ఆయన ఆరోపించారు.తనను చంపేందుకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.సరిగ్గా ఇదే పాయింటును ఢిల్లీ పోలీసులు తమ వాదనలో వినిపించారు. రామ్ దేవ్ బాబాకు భద్రత కరువైందని, కొంతమంది ఆయనను చంపడానికి చూస్తున్నారని, అందువల్లనే అక్కడ భద్రత అంతగా లేనందున ఆయనను అరెస్టు చేయవలసి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు.
see more in http://kommineni.info
0 comments:
Post a Comment