|
పీసీసి చీఫ్‌గా బొత్స ప్రమాణం సందర్భంగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేసిన ప్రాంతీయవాదం వ్యాఖ్యలు కలకలం రేపటం తో ఆయన సాయంత్రం అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చుకున్నారు. ఆయన మాట్లాడుతూ... నేను మాట్లాడింది మా కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని చెప్పేందుకే అలా వ్యాఖ్యానించానన్నారు .తమ పార్టీ గురించి కార్యకర్తలనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాను తప్పించి తెలంగాణాపై ఎటువంటి వ్యాఖ్య చేయలేదన్నారు. టీవీల్లో, పత్రికల్లో చర్చనీయాంశంగా చేసి తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు.కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా ఉన్న తాను ఏం మాట్లాడినా కేంద్రం మాట్లాడినట్లే అవుతుందని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణా అంశాన్ని అసలు తాను ప్రస్తావించలేదని అన్నారు.ప్రత్యేక తెలంగాణా అంశాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. తాను ఒక ప్రాంతానికి అనుకూలమనో, వ్యతిరేకమనో చెప్పలేననీ. తెలంగాణా పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమని వెల్లడించారు.

0 comments:
Post a Comment