|
ప్రత్యేక తెలంగాణపై కేంద్రం ఈనెల 25వ తేదీలోపు స్పష్టమైన ప్రకటన చేయాలని లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని, రాజకీయ సంక్షోభం సృష్టిస్తామని తమ సత్తా ఏమిటో చూపిస్తామని కేసీఆర్ ,తెలంగాణా పొలిటికల్ JAC హెచ్చరించిన నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం హైదరాబాద్ రావటం ప్రాధాన్యతని సంతరించుకుంది .ఆయన కొందరు ముఖ్య నేతలతో తెలంగాణ అంశం మీద తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది.చిదంబరం పర్యటనని అధికార వర్గాలు గోప్యంగానే ఉంచాయి.ఆయన ఎప్పుడొచ్చారు,ఎవర్ని కలిసారు ఏం మాట్లాడారు అనేది బయటకి పొక్కనివ్వలేదు. ఐతే డెడ్ లైన్ సమీపిస్తున్న నేపధ్యంలో హోం మంత్రి రాష్ట్ర రాజధానిలో దర్సనమివ్వటం చూస్తుంటే ఆయన స్వయంగా ఇక్కడ పరిస్థితుల్ని అంచనా వేసి ఓ నిర్ణయం తీసుకునే పనిలో భాగంగానే వచ్చినట్లు తెలుస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే ఆయన తన పర్యటనని ముగించుకుని తిరిగి ఢిల్లీ బయల్దేరారు.
అసలీ పర్యటన నేతల మనసేమిటో గ్రహించటం కోసమా ...???? లేక ప్రజల మనసు తెలుసుకోవడానికా...????

0 comments:
Post a Comment