|
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు రేపు ఉదయం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'రైతుపోరు' పేరుతో ధర్నాలు చేయనున్నారు. చిత్తూరులో జరిగే రైతుపోరు కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి పాల్గొంటారు. జరూసలేం పర్యటన ముగించుకొని ఈరోజు తెల్లవారుజామున వచ్చిన జగన్ రేపు ఉదయం నుంచే రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమంలో మహానేత వైఎస్సార్ సతీమణి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పాల్గొంటారు.
ఐతే పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టకుండా చూసేందుకు పోలీసులు నేతలను అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

0 comments:
Post a Comment