|
లోక్‌పాల్ ముసాయిదా బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనను వీడియో గ్రాఫి అవసరం లేదని , కేవలం ఆడియో మాత్రమే రికార్డు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్నా హజారే, బాబా రామ్‌దేవ్ చేపట్టిన ఉద్యమాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి జాతీయస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పేరుకొన్నారు.

0 comments:
Post a Comment