|
నేను చాలా విషయాలు మాట్లాడాల్సి ఉందని, అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండటం వల్ల పరిధులు, గీతలు దాటి మాట్లాడలేకపోతున్నానని, వచ్చేనెలరెండో వారంలో పార్లమెంట్ సమావేశాల్లో జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం ఆయనతో చర్చించాక వ్యూహాత్మకంగా ప్రకటన చేసి అప్పుడు ఇంకా స్వేచ్చగా మాట్లాడతానని అనకాపల్లి ఎంపి సబ్బం హరి వెల్లడించారు.
జగన్ విషయంలో నేను ముందుగా చెప్పిందే ప్రస్తుతం జరుగుతోందని పునరుధ్ఘాటించారు. జగన్‌ను ప్రజలు వైఎస్‌ఆర్ ప్రతిరూపంగా ఆదరిస్తున్నారని, జగన్ కూడా తన తండ్రి ఆశయాల సాధన కోసం ఒక పార్టీ స్థాపించి ప్రయత్నాలు చేస్తున్నాడే తప్ప మిగతా నేతల్లా ఆపార్టీలోనూ ఈ పార్టీలోనూ చేరలేదని అన్నారు. ప్రజా నాయకుడు ప్రజల మధ్యనే ఉండి ప్రజా సమస్యలకోసమే పోరాడుతాడని, జగన్ అలాంటి నాయకుడే అన్నారు. అనిల్ అంబానీ, టాటా, బిర్లా, కాంగ్రెస్ పార్టీలో ఎంపి లగడపాటి రాజగోపాల్ లాగా జగన్ వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తే అక్రమార్జన అనడం తగదన్నారు. ప్రజలపై పడి దోచుకోడానికి జగన్ ఎమ్మెల్యేగా,మంత్రిగా పనిచేయలేదని ఆయన అన్నారు
source www.suryaa.com

0 comments:
Post a Comment