13 June 2011

అవిశ్వాసం పెట్టమనండి నేను చేయగలిందంతా చేస్తా : జగన్

ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత  ఇద్దరూ చిత్తూరు జిల్లా వారైనప్పటికీ ఇక్కడ రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతుపోరు కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. రైతుల కన్నీటికి ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి రైతు సోదరుడికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని భరోసా ఇచ్చారు.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తి ఈరోజు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు పెట్టడంలేదన్నారు. కాంగ్రెస్­తో కుమ్మక్కయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిజాయితీగా ఎందుకు ప్రయత్నించడంలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం పడటం, పడకపోవడం అనేది వేరే విషయం నిజాయితాగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు. ప్రతిపేదవాడు, ప్రతి రైతు ఈ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. వారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే జగన్ చేయగలిందంతా చేస్తాడన్నారు. ప్రభుత్వం పడిపోతే మొదట సంతోషించేది తానేనని, ఆ తరువాత తనవెంట ఉన్న పేద ప్రజలని ఆయన తెలిపారు.
స్పీకర్ ఎన్నికల్లో పోటీ పెట్టే సాంప్రదాయంలేకపోయినా ఆ ఎన్నికని రాజకీయం చేశారని విమర్శించారు. ఆ రెండు రోజులు స్పీకర్ ఎన్నిక గురించి మాత్రమే మాట్లాడారని, ఒక్క రోజు కూడా రైతుల బాధల గురించి మాట్లాడలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు.
 

Y.S.Jagan, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us