|
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా బాన్‌కీమూన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 192 సభ్యదేశాలున్న ఐక్య రాజ్య సమితి బాన్‌కీమూన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మూన్ మరో ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 67 ఏళ్ల మూన్ దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిగా గతంలో పనిచేశారు.2012 నుండి రెండో విడత పదవీ కాలం మొదలవుతుంది.పదిహేను దేశాలతో కూడిన భద్రతా మండలి సంపూర మద్దతు పలకడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది .గెలిచినా తర్వాతా మూన్ మాట్లాడుతూ ,అసలు ఊహించలేదని..ఈ ఆనందాన్ని వర్ణించలేను అని ఆయన అన్నారు.

0 comments:
Post a Comment