|
ఆగస్టు 16 నుండి తిరిగి దీక్ష ప్రారంభిస్తానని అన్నాహజారే పేర్కొనగా ..సమస్యని పరిష్కరించాల్సిన ప్రభుత్వ (ప్రజా)ప్రతినిధులు..పౌర సమాజ సభ్యులని శత్రువుల్ని చూసినట్లు చూస్తున్నారు ,ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేసే వ్యవస్థకి ఒప్పుకునే ప్రసక్తే లేదని నిన్న కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ స్పష్టం చేయగా ఇవాళ కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ తలా తోకా లేనట్లుగా మాట్లాడుతున్నారు..ఆమారణ దీక్ష చేపడతానని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు..ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన వయసు మరచి దీక్షలకి ప్రోత్సహిస్తున్నారు..చాతనైతే ఆ యువకులు దీక్ష చేయవచ్చును కదా అని ప్రశ్నిస్తున్నారు.హజారే గాంధేయవాదే ...కాదనట్లేదు కానీ ఆయన చుట్టూ ఉన్నవారు మాత్రం కాదు .ఒకవేళ కాదు కూడదు అని ఆమరణ దీక్ష చేపడతానంటే మొన్న రామలీల లో జరిగిన ఘటనలే పునరావృతం అవ్వొచ్చు అన్నారు..మేము ప్రజలకి...జవాబుదారీ అని..హజారే కి కాదని అంటున్నారు.
వీళ్ళు ప్రజలకి జవాబు దారీ అట ... ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏ.సీ గదుల్లో ,కార్లలో తిరుగుతూ లక్సరీ లైఫ్ లీడ్ చేస్తున్న వీళ్ళా???లేక అవినీతికి వ్యతిరేకంగా ఏడు పదుల వయసులో ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా దేశం కోసం గళం ఎత్తిన హజారే నా????
దీక్ష చేస్తానంటే సమస్యని పరిష్కరించాలి అంతేగానీ ఇలా ఎదురుదాడి చేసి నోరుపారేసుకుంటే ప్రజలే గుణపాటం నేర్పుతారు ..దిగ్విజయ్ సాబ్ ..జరా సోచో జీ ...

0 comments:
Post a Comment