|
పీసీసీ చీఫ్ గా బొత్స ప్రమాణ స్వీకారోత్సవం రోజున ప్రాంతీయవాదం, ఉపప్రాంతీయవాదం లేవని అనడంపై వరసకు మామయ్య అయ్యే కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తెలంగాణా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్తెవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జైపాల్ జాతీయవాది కారనీ, ఇటలీ వనిత అయిన సోనియా గాంధీని సమర్థిస్తున్నందుకు ఆయన అంతర్జాతీయవాది అని ఎద్దేవా చేశారు. జైపాల్ రెడ్డి గతంలోనే సమైక్యవాదానికి అనుకూలంగా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. అటువంటి వ్యక్తి తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడతారని అనుకోలేమనీ, జాతీయవాదం అంటూ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారని అన్నారు.

0 comments:
Post a Comment