|
తెరాస సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ భౌతిక కాయాన్ని సందర్శించడానికి వచ్చిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వారిని చూసిన తెలంగాణవాదులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. తెలంగాణ ద్రోహుల్లారా ఖబడ్దార్ అంటూ అడ్డుకున్నారు. చెప్పులు, రాళ్లు, మట్టి విసిరి దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య,చేనేత శాఖ మంత్రి శంకర్రావుకు, ఎంపీలు రాజయ్య, వివేక్, గుండు సుధారాణి, తదితరులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. మంత్రులు తమ మంత్రి పదవులకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ ద్రోహుల్లారా..! ఖబడ్దార్’ అంటూ నినాదాలు చేశారు. చెప్పులు, రాళ్లు, మట్టితో మూకుమ్మడిగా దాడిచేశారు. ఈ ఘటనలో ఎంపీలు రాజయ్య, వివేక్‌ల చొక్కాలు చినిగాయి. వారికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

0 comments:
Post a Comment