|
రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే తమకే మంచిదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పేకొనే అవకాశం ఈ రకంగానైనా దొరుకుతుందని చెప్పారు. ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా తమ ప్రభుత్వం పడిపోయేది లేదు కూలేది లేదన్నారు. తమకు అవసరమైన సంఖ్యాబలం ఉందన్నారు. కొందరు(జగన్) అవిశ్వాసం పెట్టండి, పెట్టండి అని ఒకర్ని(టిడిపి)ని సవాల్ చేశారని పేర్కొన్నారు. తీరా వారు(టిడిపి) అవిశ్వాసానికి రెఢీ అయితే కోరిన వారు(జగన్) తోకముడిచారని ఎద్దేవాచేశారు. బుధవారం సిఎల్‌పిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కౌన్సిల్ విప్ వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌లతో కలసి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేసి కనీస మద్దతు ధర లభించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఒకటి, రెండు రోజులు ఆలస్యం జరిగినా ఆందోళన చెందవద్దని రైతులకు ఆయన విజ్ఞప్తిచేశారు. పంచె కట్టి నాగలి పట్టినంత మాత్రాన రైతు కోసం బాబు పనిచేస్తున్నారని అనుకొంటే అది పొరపాటేనన్నారు.
see more in www.suryaa.com
0 comments:
Post a Comment