ఖచ్చితంగా కానే కాదు అవిశ్వాస తీర్మానం పెట్టడంలో బాబు చతురత కనపడుతుంది.జగన్ ని అసమర్దుడిగా ప్రజల ముందు నిలపెట్టడమే బాబు ఉద్దేశమా ???
"జగన్ కన్నెర చేస్తే ప్రభుత్వం కూలి పోతుంది కదా ..కన్నెర్ర చెయ్యమని కోరుతున్నా" అని మహానాడు వేదికగా బాబు జగన్ ని ఉద్దేశించి అన్న మాట గుర్తు చేసుకుంటే బాబు వ్యుహమేమిటో అర్ధమవుతుంది. ఒక్క ఎమ్మెల్యే తో ఎలా కూల్చగలమని జగన్ స్వయంగా అనటమే బాబు తెగింపుకి కారణం . అసలు జగన్ బలమేంటో
బాబు తేల్చేద్దామని నిర్ణయించుకున్నారు.తీర్మానం వీగిపోయినా టిడిపి కి వోచే నష్టమేమీ ఉండదు .మరి జగన్ తన సామర్ధ్యం చూపిస్తాడో లేక చతికలు పడతాడో వేచి చూడాలి
ఐతే అసెంబ్లీ సమావేశాలు జరగడానికి చాలా ముందే టిడిపి నోటిసు ఇవ్వడం తో అది చెల్లుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది.
0 comments:
Post a Comment