|
రైతు సమస్యలపై ఈ నెల 13 న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తెలిపారు.బుధవారం హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధులు ,కార్యకర్తల తో జగన్ సమావేశమైనారు. ప్రజా సమస్యల పరిష్కారం పై దృష్టి సారించి త ద్వారా పార్టీ ని బలోపేతం చేయాలనీ జగన్ పిలుపు నిచ్చారు .గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారు.
పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్ట పరచడానికి ఇదే తగిన సమయమని జగన్ చెప్పారు. పార్టీ నాయకులపై తనకు నమ్మకం ఉందని, అందుకు అనుగుణం గా వారు పనిచేయాలని ఆయన కోరారు . సభ్యత్వ నమోదుపై నేతలు శ్రద్ధ వహించాలని చెప్పారు . రైతు సమస్యలపై సమావేశంలో చర్చించారు. కాగా క్షేత్ర స్తాయిలో పార్టీ ని బలోపేతం చేసేందుకు అలాగే కిరణ్ సర్కార్ పై పోరాటానికి జగన్ ఇక ఇలాంటి కార్యక్రమాలే ఎంచుకోనున్నారు .

0 comments:
Post a Comment