|
తెలంగాణా కోసం భాజపా చిత్తశుద్ధితో నిరంతరం పోరాడుతోందని తెలిపారు. తెలంగాణా ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపేందుకే తాను వచ్చానని, పార్లమెంటులో యూపీఎ తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.తెలంగాణా ఇవ్వకుండా, తాత్సారం చేసేందుకు కేంద్రంలోని యూపీఎ ప్రభుత్వం కమిటీని వేసి తెలంగాణా ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణా కోసం 600 మంది తెలంగాణా బిడ్డలు ఆత్మబలిదానం చేసారని అయినా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదని మన్మోహన్ ది చేతకాని ప్రభుత్వమని యూపీఏ సర్కార్ మీద సుష్మ దుమ్మెత్తిపోశారు .తాము అధికారం లోకి రాగానే తెలంగాణా ఇచ్చి తీరుతామని ఆమె స్పష్టం చేశారు.

0 comments:
Post a Comment