|
రామ రాజ్యమైతే తాను చూడలేదు గాని రాజన్న రాజ్యం చూశానని రాజశేఖర రెడ్డి పాలనలో క్వింటాలు ధర 500 నుండి 1000 కి చేరిందని అది సువర్ణ యుగమని రైతు దీక్ష ముగింపు సందర్బంగా రైతులను ఉద్దేశించి జగన్ ఈ విధంగా మాట్లాడారు
రైతు ప్రభుత్వం వస్తేనే రైతు గురించి ఆలోచిస్తారు అని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మాత్రమే రైతు గురించి ఆలోచించాడు అన్నారు . తెలుగు దేశం అధ్యక్షుడు బాబు రైతు ఓట్ల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు . వ్యవసాయం శుద్ద దండగ అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని , ఆయన హయాం లో రైతులు చనిపోతే తిన్నది అరగక చనిపోయారు అన్న నీచమైన వ్యక్తి బాబే అని అలాంటి వాడు రైతు కోసం మాట్లాడుతున్నాడు అని.. ,ఉచిత విద్యుత్ ఇస్తే తీగలమేద బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్న బాబు అధికార దాహంతో ఇపుడు 7 గంటలేమి కర్మ 9 గంటలు ఇస్తానని అంటున్నాడు .ఎన్నో ఏళ్లుగా రైతు కష్టాలు పడుతున్నా బాబు మేలుకుంది మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన తర్వాతనే అన్నారు. నేను ఏది చేస్తే అదే చేస్తున్న బాబు ని చూస్తుంటే తనకు నవ్వు వస్తుందన్నారు.
కడప ఉప ఎన్నికలతో తాను తీరిక లేకుండా ఉండటం వల్ల ఎన్నికల తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో రైతు దీక్ష చేస్తానన్న 4 గంటలకే బాబు కుడా రైతు బాట పట్టాడని .. అంతక ముందు ఎందుకు స్పందించలేదని తాను అడుగుతున్నానని ,బాబు కాంగ్రెస్ కుమ్మక్కై జగన్ వైపు ప్రజలు పోతుంటే అప్పుడు నిద్ర లేస్తున్నాడని దుయ్యబట్టారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గురించి చెప్పాలంటే తాను చేసిన సామూహిక దీక్ష తరువాత కనీస మద్దతు ధర 2400 ఇస్తామని చెప్పి నాలుగు నెలలు దాటినా ఇచిన మాట నిలపెట్టుకోలేదని ,వద్దే మాఫీ చేసామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు దాక పది శాతం కూడా వడ్డీ మాఫీ కూడా జరగలేదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
మహా నేత చనిపోయాక ఎ ఒక్క నాయకుడైనా రైతు కోసం ఏమైనా చేద్దామని ,రైతు బాగుండాలి,రైతు గుండెల్లో నిలిచేలా పని చేయాలని ,పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలని ఏ ఒక్క నాయకుడు ఐనా అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు
ఉత్తర ప్రదేశ్ ,వెస్ట్ బెంగాల్ లో లో లేని సమస్యలు ఆంద్ర ప్రదేశ్ లో మాత్రమే ఎందుకున్నాయని ప్రశ్నించారు.ys హయాం లో క్వింటాలు 1000 నండి 1200 కి పాయిందని అన్నారు.మనసుంటే మార్గం ఉంటుందని , ysr కి మనసుంది కాబట్టే చేయగలిగాడు అని మిగిలిన వారెవరికీ మనసు లేదని,వారు నన్ను తోక్కెయాలని ఆలోచించే సమయం లో రైతు గురించి ఆలోచిస్తే రైతు బాగుంటాడని, కిరణ్ బాబు ల పాలన చూసాము ysr సువర్ణ యుగాన్ని చూసాము ,ysr పాలన లో రైతు సంతోషం గా ఉన్నాడని మళ్లీ ఆ స్వర్ణ యుగాన్ని తెచ్చుకుందామని అన్నారు. రైతు సంతోషం గా లేని ప్రభుత్వాన్ని బంగాళా ఖాతం లో
కలిపినా సిగ్గు రాదని.. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధిని ఇవ్వాలని తాను దేవుడిని ప్రార్ధిస్తానని అన్నారు.
కలిపినా సిగ్గు రాదని.. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధిని ఇవ్వాలని తాను దేవుడిని ప్రార్ధిస్తానని అన్నారు.
పెట్రోల్ ధరలపై ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునే పెట్రోల్ మీద 5 రూపాయలు పెంచిందని ,ఈ సంవత్సరం లో పది రూపాయలు పెంచిందని ఇది భావ్యమేనా అని తాను కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నా అన్నారు. ఇది రైతుల వేదిక ఐనందున ఈ వేదిక మీద నుండి ఇంతకు మించి ఎక్కువ మాట్లానని తన ప్రసంగాన్ని ముగించారు . తరువాత సత్తెనపల్లి రైతు ఇచ్చిన నిమ్మరసం తాగి దీక్ష విరమించారు.

0 comments:
Post a Comment