|
ముచ్చటగా మూడోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అన్నాడిఎంకె అధ్యక్షురాలు జె జయలలిత మూడో ఫ్రంట్‌కు ఊపిరిపోసే ప్రయత్నాలు ఆరంభించారు. వామపక్షాలు, తెలుగుదేశంతో కలిసి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
జయలలిత అధికారంలోకి రావటంతో తృతీయ ఫ్రంట్ రాజకీయం ఉపందుకుందన్న భావన రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏకు, అటు బిజెపి నాయకత్వంలోని ఎన్డీయేకు మెజార్టీలు వచ్చే అవకాశాలు లేవని థర్డ్ ఫ్రంట్ కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మూడో ఫ్రంట్ ద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నాలకు జయలలితతో పాటు చంద్రబాబు ,ప్రకాశ్ కారత్,ఏబి బర్దన్‌లు పదును పెడుతున్నట్టు చెబుతున్నారు.
ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న జయలలితకు సోనియా అందరికంటే ముందే టెలిఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అభినందలకే పరిమితం కాకుండా, జయలలితను తన ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించారు. యుపిఏ సంకీర్ణ సర్కారుకు డిఎంకె మద్దతు ఉపసంహరించుకునే పరిస్థితిలో అన్నాడిఎంకె మద్దతు కూడగట్టటంతో పాటు జయలలిత బిజెపి వైపు ఆకర్షితురాలు కాకుండా చూసే వ్యూహంలో భాగంగానే సోనియా ఆమెను తేనీటి విందుకు ఆహ్వానించారన్న వాదన వినిపిస్తోంది.
సోనియా నుంచి తేనీటి విందు ఆహ్వానం అందిన మరుసటి రోజు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి జయ..ఏబి బర్దన్, రాజాను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించటం ఆశ్చర్యపడాల్సిన అంశం కాదు. అయితే కాంగ్రెస్‌కు బద్ద వ్యతిరేకులైన చంద్రబాబు,నరేంద్ర మోడీలను ఆహ్వానించటం వెనకాల ఉన్న మర్మమెంటో అమ్మ కే తెలియాలి !!!
.
source www.andhrabhoomi.net

0 comments:
Post a Comment