|
తెలుగుదేశంపార్టీ త్వరలో యూపీఏలో చేరబోతున్నదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. తమిళ రాజకీయ పార్టీ ద్వారా యూపీఏ సర్కారుతో పొత్తు కుదుర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేత ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకు సంభందించి తన వద్ద అధారాలు కూడా ఉన్నాయన్నారు.రాష్ట్రంలో ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉండదన్నారు. వైఎస్‌ఆర్ పార్టీ ఇక ప్రజలకోసం పనిచేసే ప్రతిపక్షపాత్ర పోషిస్తుందన్నారు.
జూపల్లి డి.కే. అరుణల తీరు సినిమా షూటింగ్‌ను తలపిస్తోందన్నారు.ఇద్దరు మంత్రులనే అదుపుచేయలేని ముఖ్యమంత్రి ఇక రాష్ట్రాన్ని ఎలా అదుపు చేయగలరన్నారు. కుక్కకాటు వాక్సిన్‌కూడా అందచేయలేని ప్రభుత్వం ఇక ఆరోగ్యశ్రీని ఎలా అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం పెంచిన బీటీ పత్తి విత్తన ధరలను వెంటనే తగ్గించాలన్నారు.జులై 8న వైఎస్‌ఆర్ పార్టీ ప్లీనరీలో పార్టీ విధివిధానాలు ప్రకటిస్తారని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు.
source www.suryaa.com

0 comments:
Post a Comment