|
రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలబడేందుకు తాము ముందుంటామని మహానేత వైఎస్ఆర్ సతీమణి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్.విజయలక్ష్మి హామీ ఇచ్చారు.పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను ఆమె పరామర్శించారు. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అన్నివేళలా అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో వీచిన పెనుగాలులకు మామిడి పంటకు అపార నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. కేవలం రైతులకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు.

0 comments:
Post a Comment