21 May 2011

పుడితే ఎంపి గా పుట్టాలి ...

పుడితే ఎంపి గా పుట్టాలి ...ఏంటి ఎంపి గా పుట్టాలనుకోవడం  అంటారా ... వార్తలోకి వస్తే గత కొన్నేళ్ళ యుపీయే సంకీర్ణ ప్రభుత్వం లో వెలికి చూసిన అవినీతిలో ప్రధాన భూమిక ఎంపీ లదే కావడం  ఇక్కడ గమనించాల్సిన విషయం  ఎక్కడ ఏ అవినీతి కుంభకోణం బయటపడినా దానిలో మన ఎంపీలు పాత్ర ధారులంటే విని ఆశ్చర్య పోవాలో సిగ్గుపడాలో తెలియని పరిస్థితిలో సగటు జీవి ఉన్నాడు.
 నాణేనికి మరోవైపు ఉన్నట్లే ... మన ఎంపిల జీవితాలను , వారి అవినీతిని నేటి యువత  ఆదర్శంగా తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే తప్పు చేస్తే దోషులకు కఠిన శిక్ష  పడే అవకాశం లేకపోవడమే కారణం. శిక్ష సంగతి దేవుడెరుగ అత్తగారింటికి కొత్త అల్లుడు వస్తే చేసినట్లు అన్ని రాచ మర్యాదలూ  చేస్తారు మన పోలీసులు  ఏ లోటు  రాకుండా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తుంటారు అధికారులు . 
తాజాగా వెలికి చుసిన  2జీ స్పెక్ట్రమ్  కేసులో సీబీఐ అరెస్టు చేసిన రాజ్యసభ సభ్యురాలు, డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె కనిమొళికి తీహార్ జైలులో రాజభోగాలు కల్పించారు. ఈమె ఎంపీ గా  ఎం వేలగ  పెట్టిందని ?? పోనీ  ప్రజలకోసం ఏనాడైనా ఏం  చేసి ఎరిగిన మనిషని??? దేశం లో  కనీ వినీ ఎరుగని  కుంభకోణం లో ఇరుక్కుని  జైలుకొస్తే కుడా సకల సౌకర్యాలు మర్యాదలు  ఎందుకు చేస్తున్నారు పోలీసు  మామలు ???
కనిమొళి వ్యవహారంలోకే వస్తే ఆమెకు కేటాయించిన గదిలో అటాచ్డ్ టాయ్‌లెట్‌ టెలివిజన్, ఫ్యాన్, లైట్ సౌకర్యాలు కాకుండా  దక్షిణ భారత భోజనాన్ని కుడా ఈమెకు కల్పించారు .. జైలులోని ఇతర హైప్రొఫైల్ ఖైదీల మాదిరిగా కనిమొళిని కూడా వీఐపీలా పరిగణించడం జరగదని ఆ రాష్ట్ర  జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆర్.ఎన్.శర్మ అన్నారు . కల్పించిన  సౌకర్యాలు చాలవా సారూ ఇంకా ఏం కావాలి  ఓ లంచగుండికి ??? ఓహో  వేసవి కాలం కదా... ఏ.సీ గాని కేటాయించలేదని అయ్యవారి బాధ కాబోలు... 
నేరస్థులకు అన్ను దున్నుగా  పోలీసులు ,న్యాయవ్యవస్థలు ఉన్నంత కాలం దేశం లో ఎన్ని కుంభకోణాలు బయటపడినా  ఒరిగేదేమీ ఉండదు.
                                                   _ for a corruption free nation

D.M.k, General Issues

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us