|
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రులను వెనకేసుకొచ్చారు . .మంత్రులపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. తన మంత్రి వర్గంలో వై.ఎస్. జగన్ కోవర్టులున్నారని తాను అనుకోవడం లేదని కేకేఆర్ స్పష్టం చేశారు.ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు జూపల్లి కృష్ణారావు, డీకే అరుణకు గొడవలొద్దని తాను సూచించినట్లు చెప్పారు. పీ సి సి అధ్యక్షుడు శ్రీనివాస్ కుడా మంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారని మంత్రుల గొడవను పార్టీ పరిష్కరిస్తుందని కిరణ్ కుమార్ వెల్లడించారు.

0 comments:
Post a Comment