|
క్యాబినెట్ విస్తరణపై మళ్ళీ ఊహగానాలు ఊపందుకున్నాయి.చాలారోజులుగా ఖాళీగా ఉన్న కీలక పదవులను భర్తీ చేయవచ్చని అంటున్నారు ముఖ్యమంత్రి కిరణ్ తన టీం ను మార్చాలని ఉత్సాహ పడుతున్నట్టు తెలుస్తోంది ఆజాద్ కి ఈ విషయం ఇంతకుముందే స్పష్టం చేసినట్టు సమాచారం ఢిల్లీ వెళ్ళిన సీఎం పనిలో పనిగా తన మనసు విషయాలను ఆజాద్ ముందు ఉంచ నున్నట్టు తెలుస్తోంది .అయితే అధిష్టానం కిరణ్ అభిప్రాయానికి ఎంత మేరకు విలువ ఇస్తుందో సందేహమే అంటున్నారు.ఇప్పటికే కిరణ్ ఆశించినస్థాయిలో పని చేయలేదని అధిష్టానం భావిస్తోంది . జగన్ ను ఎదుర్కోనే విషయం అలా ఉంచితే కాబినెట్ మంత్రులతో కూడా కిరణ్ సరైన రీతిలో పనిచేయించుకోలేక పోతున్నారని ఆజాద్ తన రిపోర్ట్ లో పేర్కొన్నట్టు సమాచారం .సమన్వయ లోపం ,నాన్ సీరియస్ నెస్ వల్ల పాలనా కూడా కుంటుపడిందని ఆజాద్ అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది సీఎం కి అయన లోపాలు గురించి తెలియ చేసి మరి కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.మంత్రి వర్గం లో కోవర్టులు వున్నారని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు వారిని మార్చే యోచన లో అధిష్టానం లేదని అంటున్నారు .కోవర్టుల పేరిట కొందరిని బయటకు పంపితే జగన్ కి మరో అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆజాద్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మార్పులు చేయ దలిస్తే కేవలం శాఖల మార్పిడికే పరిమితం కావచ్చని అంటున్నారు. మొత్తం మీద కిరణ్ టీం లో మార్పులు ఇప్పట్లో ఉండక పోవచ్చు.
courtesy జై జై నాయకా

0 comments:
Post a Comment