20 May 2011

కాకా పరిస్తితి సేరియస్

కాంగ్రెస్ సేనియర్ నేత వెంకట స్వామి అనారోగ్యం పాలయ్యారు
ఈ సాయంకాలం ఆయనకు స్వల్పం గా గుండె పోటు రావడం తో
సోమాజీగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు .ఆయనకు
హై బీపీ వునట్టు డాక్టర్లు గుర్తించారు .శ్వాస పీల్చుకునేందుకు
కాకా ఇబ్బంది పడుతుండటం తో డాక్టర్లు వెంటిలేటర్ అమర్చారు .
వెంకట స్వామి కొంత కాలంగా అస్తమా తో బాధ పడుతున్నారు .
వెంకట స్వామి వయసు  81సంవత్సరాలు .ఆయనకు ఇద్దరు కొడుకులు ,
ఒక కుమార్తె వున్నారు .కుమారుల్లో వినోద్ గతం లో మంత్రి గా పనిచేయగా
 మరో కుమారుడు వివేక్  ప్రస్తుతం ఎంపీగా వున్నారు .
కాకా గా ప్రసిద్ధి గాంచిన వెంకట స్వామి 7 సార్లు ఎంపీ గా
ఎన్నికయ్యారు .ఇటీవలే అయన సోనియా ను విమర్శించి వార్తల్లో కెక్కారు .
 కాగా మంత్రి శ్రీధర్ బాబు యశోద ఆసుపత్రి కి వచ్చి
 కాకా ఆరోగ్యం గురించి డాక్టర్ల తో మాట్లాడారు

Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us