|
అవును ... ఈ నెలలోనే తెలంగాణ ఫై కాంగ్రెస్ హైకమాండ్ అనుకూల ప్రకటన చెయ్యవచ్చునని తెలుస్తోంది. తెలంగాణ అంశం ఆజాద్ హైదరాబాద్ పర్యటన లో ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చింది. దీని పైన త్వరగా ఏదో ఒకటి తేల్చాలని అటు సీమాంధ్ర నేతలు ఇటు తెలంగాణా కాంగ్రెస్ నేతలు కోరడం జరిగింది. తాము ప్రజల్లోకి వెళ్ళలేక పోతున్నామని త్వరగా ఏదో ఒకటి తేల్చి ఓ ముగింపు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళు ఆజాద్ కి తమ తమ విన్నపాలు వినిపించుకున్నారు . అన్నిటినీ ఆజాద్ చిరునవ్వుతో స్వీకరించారు తప్ప తన మరియు అధినాయకత్వం మనసేంటి అనేది మాత్రం బయటపెట్టలేదు . తమ గోడు అంతా ఓపికగా ఆలకించిన ఆజాద్ ఎం చెయ్యబోతున్నారు అని తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఆతురతగా ఎదురు చూస్తున్నారు .
ఇలాంటి సమయంలో ఆజాద్, సోనియాల నిర్ణయం ఎలా ఉండపోతోంది ??? ఏ నిర్ణయం తీస్కోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సోనియా కి ,ఆజాద్ ఏమి సిఫారసు చేస్తారు??? వారి ముందున్న దారులేంటి ???
* తెలంగాణా అనుకూల ప్రకటన చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టడం
*ఇయ్యబోమని స్పష్టం గా తెల్చిచెప్పడం .
రెండవది ఎలాగో జరగని పని .అనుకూల ప్రకటన చేసి బిల్లు ప్రవేశ పెట్టడమే ఇప్పుడున్న ఎఖైక దారిగా వారు భావిస్తారా ???
తెలంగాణా అనుకూల ప్రకటన చేయక తప్పని పరిస్థితే ..ఎందుకంటే కాలయాపన చేస్తే ఇప్పుడున్న కాస్తో కూస్తో ప్రజాదరణ కుడా కోల్పోయే ప్రమాదం ఉంది ,అదే కాక ఇంకా నాన్చితే టి.ఆర్.యస్. మరియు ఇతర తెలంగాణా అనుకూల వర్గాల చేతుల్లో బలవ్వడం ఖాయం ,కొత్తగా వీస్తున్న జగన్ ఫాను రెక్కలకు బలవ్వక తప్పదు .జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ మళ్లీ అంత సాహసం చెయ్యదు అలా అని తెలంగాణా ఇస్తే సమస్యలుండవు అనుకుంటే అది కుడా జరగని పని .ఎం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి ..అప్పటి దాకా ఉద్యమాల సెగలు పొగలు తప్పవు...

0 comments:
Post a Comment