|
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులూ ఉండరన్న సిద్ధాంతం వర్తించని పార్టీలు వామపక్షాలు మాత్రమే అని ఇప్పటిదాకా జనానికి ఉన్న నమ్మకం ఆవిరైపోతున్నది. రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ నాయకత్వాలు క్రమంగా తెలుగుదేశం పార్టీకి దూరమై జగన్ పార్టీకి చేరువవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పట్ల జగన్ తన అభిప్రాయాలు తెలియజేస్తే ఆయనతో కలసి పని చేసేందుకు సిద్ధం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నట్టు గతంలో కథనాలు వచ్చాయి. కడప ఉప ఎన్నికల తర్వాత జగన్ విజయం చూసి వామపక్షాల వైఖరిలో మార్పు వస్తున్నదని, తెలుగుదేశం పార్టీపై ఇక వారు ఆశలు ఉంచుకోదలచలేదనీ అర్థం అవుతున్నది.
www.suryaa.com

0 comments:
Post a Comment