|
కడప ఉప ఎన్నికల్లో సానుబూతి పనిచేసినందునే వదిన వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ గెలిచారని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు ప్రాముఖ్యతనివ్వదని, ప్రజల ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తుందని వివేకా అన్నారు. తన ఓటమిపై జగన్ బాధపడనవసరంలేదని, ఆయన సానుభూతి తనకవసరం లేదని వివేకా అన్నారు. అంత నిజాయితీ ఉంటే జగన్ కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చని పార్టీలో అందరూ కలిసి సంతోషంగా ఉండొచ్చని వివేకా అన్నారు. తానెక్కడికి వెళ్లడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయనన్నరు.
courtesy www.suryaa.com
0 comments:
Post a Comment